Ajanta Youth Meets Singareni Officers Respectfully
సింగరేణి ఆఫీసర్స్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అజంతా యూత్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామం అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి మేనేజర్, ప్రాజెక్టు ఆఫీసర్ నీ మర్యాద పూర్వకంగా కలిసి గ్రామంలో ఉన్న సమ్యసల గురించి మాట్లాడుతూ ఎల్లవేళలా గ్రామ అభివృద్ధిలో సింగరేణి యాజమాన్యం కలిసి గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా తోడ్పడాలి అని అజంతా యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూత్ వైస్ ప్రెసిడెంట్ కుక్కమూడి చిన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మట్టెవాడ హరీష్, కోశాధికారి కుక్కమూడి నవీన్, కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, నవీన్,నరేష్, తిరుపతి, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
