నడికూడ,నేటి ధాత్రి: మండల కేంద్రంలో దేవునూరి అశోక్ వ్యవసాయ భూమి లో ఐరా సీడ్స్ కంపెనీ మిర్చి పంట ప్రదర్శన క్షేత్రం చేయడం జరిగింది ఈ యొక్క ఐరా సీడ్స్ కంపెనీ నమోస్విని (తేజ ) రకం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని వివిధ చీడపీడలను నల్లిని అధిక వర్షాలను తట్టుకొని చెట్టు వేపుగా పెరిగి దగ్గర కాపు ఉంది ఈ నమోస్విని అనే రకం అన్ని రకాల నేలలకు అనుకూలమైనదిగా వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు హనుమంతరావు, రవిరెడ్డి కంపెనీ ఆర్ ఏమ్ రాజేష్, కంపెనీ సేల్స్ ఆఫీసర్లు మొర్రి సంపత్, మాసంపల్లి సుమన్ వివిధ గ్రామాల నుంచి సుమారు 450 మంది రైతులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా దేవునూరి అశోక్ మాట్లాడుతూ ఈ యొక్క తేజరకం నల్లికి తట్టుకొని కింది నుండి చిక్కటి కాపు వచ్చిందని ఎకరాన 30 నుండి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతు అశోకు చెప్పారు.