
AIMIM Leaders Meet Collector for Development
జహీరాబాద్: రోడ్లు మరియు పాఠశాలల అభివృద్ధి అభ్యర్థనలు కలెక్టర్‌కు సమర్పించిన నాయకులు
“◆:- ఏఐఎంఐఎం జహీరాబాద్ నాయకులు అథర్ అహ్మద్ ముహమ్మద్ తసఫుర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ సహబ్ ఏఐఎంఐఎం చీఫ్ & ఎంపీ హైదరాబాద్ నాయకత్వంలో & కౌసర్ మొహియుద్దీన్ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే & సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ సూచనల మేరకు ఎండి అథర్ అహ్మద్ అధ్యక్షుడు జహీరాబాద్ ముహమ్మద్ తసఫుర్ యువ నాయకుడు & కోశాధికారి జహీరాబాద్ షేక్ ఇలియాస్ జాయింట్ సెక్రటరీ జహీరాబాద్ తో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి షహీన్ నగర్ ఫయాజ్ నగర్ కాలనీ జహీరాబాద్ మునిసిపాలిటీలో అభివృద్ధి పనులు కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. జడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం స్కూల్ ఫయాజ్ నగర్ కాలనీకి రోడ్డు నిర్మాణం మరియు మరమ్మత్తు షాహీన్ నగర్లో కొత్త ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు స్థానిక మదర్సా, పోచమ్మ ఆలయం చర్చికి యాక్సెస్ రోడ్ల నిర్మాణం వంటి అభ్యర్థనలు ఉన్నాయి. స్థానిక సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని అధికారులను కోరారు.