Aagur Shivaraj Elected Veerashaiva Lingayat President
తాలూకా వీరశైవ లింగాయత్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,నియోజకవర్గం వీర శైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక బసవేశ్వర ఫంక్షన్ హాల్ లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్ష కార్యవర్గం, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణా కౌలాస్, కార్యదర్శి పద్మజ, స్థానిక లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో జిల్లా నుండి అధ్యక్షులు ఇప్పేపల్లి నరసింహు లు, ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధి కారి పోలీస్ సంతోష్ పటేల్, యువజన ప్రధాన కార్యదర్శి రామోజీ నవీన్, స్థానిక లింగాయత్ సమాజ్ అధ్యక్షులు రాజశేఖర్ శెట్కర్, ప్రధాన కార్యదర్శి ఆర్ సుభాష్ సమక్షంలో జరిగిన ఎన్నికలలో జహీరాబాద్ నియోజకవర్గం మండలాల వారీగా కూడా ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గ వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోహీర్ మండలం నుండి బిల్లాపాటి విజయకుమార్, మండల అధ్యక్షునిగా ఎన్నుకోగా మొగడంపల్లి మండల అధ్యక్షులుగా ఎం రా%శీ% శెట్టి, ప్రధాన కార్యదర్శిగా ఎల్ విజయ్ కుమార్ ఝరా సంగం మండల అధ్యక్షునిగా పట్లోళ్ల రవి పటేల్, ప్రధాన కార్యదర్శిగా పొట్లోళ్ల పరమేశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన కార్యవర్గానికి అధ్యక్షులు త్వరలో ప్రకటిస్తారని సమావేశం ప్రకటించింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆగూర్ శివరాజ్ మాట్లాడుతూ తనమీద ఉన్న నమ్మకంతో జిల్లా, స్థానిక అధ్యక్ష కార్యవర్గానికి, మండల సభ్యులందరికీ తన ధన్యవాదాలు తెలిపారు.
