చిందం శ్రీకాంత్
ముత్తారం :- నేటి ధాత్రి
వానాకాలంలో విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై శుక్రవారంపేట గ్రామంలోని రైతులకు మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ రైతులకు అవగాహన సూచనలు తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ రైతుల విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్ తీసుకొని పంటకాలం అయిపోయే వరకు భద్రపరచుకోవాలని అన్నారు.బిల్ పై విత్తన లాట్ నెంబర్,గడువు కాలంలను సరి చేసుకోవాలని అన్నారు.వరి రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట విత్తనాలైనా జీలుగ వేయాలని తద్వారా భూసారం పెరుగుతుందన్నారు. వరి పంట కోత తర్వాత వారిలో కోయకాలను కాల్చకుండా నీరు వేసి మూడు బస్తాలు ఎస్ఎస్పి వేసినచో వరి కొయ్య కాళ్లు మురిగి భూసారం పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ హారిక రైతులు పాల్గొన్నారు.