వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల బృందం
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామం రైతుల పొలాలని సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో విలాసాగర్ గ్రామములో వరి మరియు ప్రత్తి పంట చేనులని పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం వరిలో మోగిపురుగు మరియు కంకి నల్లి గమనించడం జరిగింది. మోగి పురుగు నివారణకు క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మి.లీ. మందుని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కంకి నల్లి నివారణకు స్పైరోమెసిఫిన్ 1 మి.లీ. మందుని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే ప్రత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోరొప్రిడ్ 0.3 మి.లీ. లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రాముల మందుని ఒక లీటర్ నీటికి కలిపి పిచకారీ చెయాలి. పిండి నల్లి నివారణకు ప్రోఫినోఫాస్ 2 మి.లీ. మందుని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్తలు డా. ఏ. విజయ భాస్కర్, డా. జి. ఉషారాణి, డా. పి. మధుకర్ రావు, జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ విస్తరణ అధికారి రజిత, గ్రామ రైతులు పాల్గున్నారు.