మహిళా సంఘాల సభ్యులే ఉండాలన్న దానిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి!!!
మహిళా సంఘాలలో సభ్యులుగా లేకున్న కమిటీలో బాగ స్వామ్యం చేయాలి!!!
ఎండపల్లి నేటిదాత్రి
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకై ఏర్పాటు చేయబడిన అమ్మ ఆదర్శ కమిటీల పై పై కొంతమంది పిల్లల తల్లులు అసహనం వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసి కమిటీలు ఉండగా వాటి స్థానంలో ఇటీవల నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకై అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే కమిటీలు బాగానే ఉన్నా ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా నిబంధనలో లోపాలు మాత్రం కొంతమంది పిల్లల తల్లులకు చోటు కల్పించే విధంగా లేవని కొంతమంది తల్లులు అవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వం ఇటీవల అమ్మ ఆదర్శ కమిటీలలో సభ్యులుగా ఉండాలి అంటే తప్పనిసరిగా మహిళా సంఘాల సభ్యులై ఉండాలన్న నిబంధన కొంతమంది వారు ఓటేసే అవకాశం కోల్పోతున్నామని ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల తల్లులందరికీ మహిళా సంఘాలతో సభ్యత్వంతో సంబంధం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లులందరికీ అవకాశం కల్పించాలని అమ్మ ఆదర్శ కమిటీలలో నిబంధనల పై ప్రభుత్వం పునరాలోచించి పాఠశాలల్లో చదివే తల్లులు అందరికీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు