వేములవాడ నేటి ధాత్రి
కోడే మొక్కులకు వేములవాడ పుణ్యక్షేత్రం, ప్రసిద్ధి వీటి ద్వారా ఆలయానికి ఏటా 10 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది అయితే ఆ కోడెల సంరక్షణ మాత్రం అధికారులు గాలికి వదిలేశారు ఫలితంగా అవి తరచూ మృతి చెందుతున్నాయి తాజాగా గురువారం రెండు చనిపోగా మరో నాలుగు మృత్యువు తో పోరాడుతున్నాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన కోడేలు తరచూ మృత్య వాత పడుతున్నాయి ఆలయ సమీపంలోని కట్టకింద ప్రాంతంలో తిప్పాపూర్ లో గోశాలలు ఉన్నాయి కట్టకింద గోషాలలో ఆలయంలో తిరిగే కోడేలు ఆవులను సంరక్షిస్తుంటారు తిప్పాపూర్ లో భక్తుల సమర్పించినవి ఉంటాయి వీటిని సంరక్షణ ఆలయ అధికారులు 50 లక్షల వరకు వెచ్చిస్తున్నారు తిప్పాపూర్ గోషాలలో ప్రస్తుతం దాదాపు 1000 ఉన్నాయి వాస్తవానికి ఇందులో 300 కోడేలను సంరక్షించిందుకే వసతులు ఉన్నాయి ఈ ఏడాది జనవరి ముందు వరకు భక్తుల సమర్పించిన వాటిని తెలంగాణ గోశాల ఫెడరేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ గోశాలలకు ఆలయ అధికారులు అందజేసేవారు అయితే అవి పక్కదారి పడుతున్నాయి అనే ఆరోపణలు రావడంతో అప్పటినుంచి పంపిణీ చేయడం నిలిపివేశారు దీంతో వీటి సంఖ్య బాగా పెరిగింది వసతులు అంతంత మాత్రంగానే ఉండటంతో అనారోగ్యం పారిన పడే ప్రాణాలు కోల్పోతున్నాయి
ప్రతిపాదన దశలోనే పంపిణీ
రాజన్న కోడెలను గతంలో ఆలయ అధికారులు వేలం ద్వారా భక్తులకు అందజేసేవారు ఇలా తీసుకున్న వాటిని కబేలాలకు తరలిస్తునరన్న ఆరోపణలు రావడంతో వేలం వేయడం ఆపేశారు తర్వాత తెలంగాణ గోశాల ఫెడరేషన్ సంస్థ ద్వారా అనుమతులు పొందిన గోశాలలకు అందజేసేవారు ఈ ఏడాది జనవరిలో మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బ తండా లోని గోశాలకు 20 కోడలను ఇచ్చారు తనిఖీల సమయంలో వారు తరలిస్తున్న వ్యాన్ లో మాత్రం 24 కోడేలు పట్టుబట్టడంతో అనుమానాలు తవ్వించింది దీంతో అప్పటినుంచి ఇతర గోశాలలకు పంపిణీ చేయడం లేదు అర్హులైన రైతులకు ఉచితంగా పంపిణీ నిర్ణయించి దేవదాయ శాఖ కమిషనర్ కు ప్రతిపాదన చేశారు దీనికి ఆమోదం లభించలేదు మరోవైపు వీటి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది వసతులు లేక సంరక్షణ భారంగా మారింది చాలావరకు ఎండలోనే ఉంటున్నాయి ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి సంరక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు