నేటి విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టును సద్వినియోగం చేసుకోండి
విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ సంజయ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
నేడు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల మండలాల విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టును గురువారం చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో టీజీ ఎన్పీడీసీఎల్ సిజిఆర్ఎఫ్ -1 చైర్ పర్సన్ వేణుగోపాల చారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఇంచార్జ్ ఏఈ సంజయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ, విద్యుత్ నియంత్రికల మార్పు, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం, నూతన సర్వీసుల మంజూరు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కోర్టును నిర్వహిస్తామన్నారు. కావున మండలంలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.