వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి బిజెపి సీనియర్ నాయకులు న్యాయవాది మున్నూరు రవీందర్ ను రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యునిగా అధిష్టానం నియమించింది ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నా చిన్నతనం నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులుగా పని చేసి భారతీయ జన సంగు సభ్యులుగా అనంతరం బిజెపి పార్టీ ఆవిర్భవించిన తర్వాత వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేశానని తెలిపారు1994 అసెంబ్లీ ఎన్నికలలో వనపర్తి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి7845 ఓట్లు సాధించానని చెప్పారు వనపర్తి బార్ కౌన్సిల్ అధ్యక్షునిగా పని చేశానని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా బిజెపి అధ్యక్షులు ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి నాయకులు బి శ్రీశైలం డి నారాయణ మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు బచ్చురాం బాబురావు బిజెపి నాయకులు పాల్గొన్నారు