
RDO Ramadevi.
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
• భూభారతిలో సమస్యల శాశ్వత పరిష్కారం
• మెదక్ ఆర్డిఓ రమాదేవి
నిజాంపేట: నేటి ధాత్రి
భూ భారతిని మండల వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భూ భారతిలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారం అవుతాయని మెదక్ ఆర్డీవో రమాదేవి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆమె సందర్శించి రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు.. ప్రజలు భూ సమస్యల నివృత్తి కోసం రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 12 వరకు తేదీల వారిగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. భూభారతిలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారం అవుతాయని ఆమె పేర్కొన్నారు. భూ సమస్యల పై అధికారులకు దరఖాస్తుల రూపంలో వారి సమస్యలను అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాసులు, నయాబ్ తాహసిల్దార్ రమ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, ధరణి కంప్యూటర్ ఆపరేటర్ రాజు, గ్రామ ప్రజలు ఉన్నారు.