అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ట్రాక్టర్ లారీ పట్టివేత..!
– అద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన న్యాల్కల్ మండలంలో శుక్రవారం నాడు హద్నూర్ ఎస్పై చల్ల రాజశేఖర్ సమాచారం మేరకు అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ఒక లారీ సీజ్ చేశారు హుస్సేల్లి చెక్పోస్ట్ దగ్గర హద్నూర్ ఎస్పై చల్లా రాజశేఖర్ తోటి సిబ్బందితో వాహన తనిఖీలు చేపడుతుండగా గణేష్ పూర్ గ్రామం నుండి ఒక ట్రాక్టర్( కె ఏ 38 టీ 5174 ) అశోక్ లేలాండ్ లారీ (ఏపీ 13 టీ 4188) లో అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తుండగా వాటిని పట్టుకొని వివరాలు అడగగా ఎర్ర రాయికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని ఆ ట్రాక్టర్ లారీ లను స్వాధీన తీసుకొని న్యాల్కల్ మండల్ ఎమ్మార్వోకు తగు చర్య తీసుకోవాలని సీజ్ చేసిన ట్రాక్టర్ లారీని అధికారులకు అప్పగించారు. హద్నూర్ ఎస్సై చల్లా రాజశేఖర్ తెలిపారు.