
శాయంపేట నేటి ధాత్రి;
శాయంపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించబడే సర్వసభ సమావేశం కోరం లేక వాయిదా పడింది. మండల సర్వసభ సమావేశంలో మాత్రమే శాయంపేట ఎంపీటీసీ, కొప్పుల ఎంపిటిసి మాత్రమే హాజరు కాగా మిగతా ఎంపీటీసీలు సభ్యులు హాజరు కాకపోక్రవడంతో సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది.
త్రాగునీటి సమస్య ఉండొద్దని అధికారులకు ఆదేశాలు
శాయంపేట మండలంలో తాగునీటి కొరత లేకుండా ఉండాలని అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖాముఖి అధికారుల సమావేశం నిర్వహించి మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో ఎలాంటి తాగునీటి సమస్య ఉండొ ద్దని అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.