ఆదివాసీ లు పార్లమెంట్ ఎన్నికల్లో ఆస్థిత్వాన్ని చాటాలి.

“తుడుందెబ్బ” పిలుపు.

కొత్తగూడ /గంగారం, నేటిధాత్రి :

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం ను భూర్జవ రాజకీయ పార్టీలు అతి తక్కువగా ఓటు బ్యాంక్ ఉండ బడిన లంబాడా సామాజిక వర్గానికి దార దత్తం చేసి ఈ పార్లమెంట్ పరిధిలో ఘననీయంగా ఓటు బ్యాంక్ కల్గిగిన ఆదివాసీ సామాజిక వర్గానికి రాజకీయ సమాధి కడుతున్నాయని, భూర్జవ రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్, బీజేపీ బిఆర్ ఎస్ లు ఆదివాసుల పైన కొనసాగిస్తున్న రాజకీయ కుట్రలను ఆదివాసీ ఓటరులు గమనించి ఈ పార్టీలకు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో తగిన గుణపాఠం చెప్పాలని తుడుందెబ్బ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి పిలుపునిచ్చారు ఈ రోజు కొత్తగూడ మండల కేంద్రంలో ని గ్రామపంచాయతీ ఆవరణలో ముఖ్య నాయకుల సమావేశం లో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎంపీ ఎన్నికల్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంపీ స్థానంలో విద్యా వంతుడు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షలు డా, మైపతి అరుణ్ కుమార్ ను ఇండిపెండెంట్ గా బరిలో నిలుప్తున్నామని ఆదివాసీలని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు బలి చేస్తూ అన్నీ రంగాల్లో వెనుకబాటుకు గురి చేస్తున్న దోపిడీ భూర్జవ పెట్టుబడి దారి రాజకీయ పార్టీలను ఆదివాసీల ప్రాంతం నుండి తమ ఓటు ద్వారా తరిమి కొట్టి ఆదివాసీలను రాజకీయంగా విముక్తి చేయాలనీ అదే విధంగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం దొడ్డి దారిన ST రిజర్వేషన్ అయిందని గతంలో భద్రాచలం ST ఎంపీ స్థానం ఉండేదనీ అప్పుడు ఆదివాసీలు మాత్రమే ఈ స్థానంలో ఉంటూ అదివాసుల సమస్య ల పై పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఉండేది అని అడ్డ దారిలో రాజకీయ కుట్రలో భాగంగా మహబూబాబాద్ ను ఎంపీ స్థానం చేయడం వల్ల ఆదివాసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైనరాని రానున్న ఎన్ని కల్లో తుడుందెబ్బ అభ్యర్థి గెల్పించుకొని రాబోయే రోజుల్లో జరగనున్న డీ లిమిటేషన్ లో భద్రాచలం కేంద్రంగా ఎంపీ స్థానం గా ఏర్పాటు చేసేందుకు పోరాడుతామణి ఈ ఎన్నికల్లో ఆదివాసీల కు మహబూబాబాద్ పార్లమెంట్ సీటు ఏ పార్టీ కూడ కేటాయంచకుండా అడవి బిడ్డల మనోభావాలను దెబ్బ తీసిన భూర్జవ రాజకీయ పార్టీల కు ఆదివాసీలు తగిన బుద్ది చెప్పాలని ప్రధమంగా ఆదివాసీలకు జరుగుతున్న నష్టం పట్ల యువత ఆలోచన చేసి తుడుం దెబ్బ ఉద్యమం లో కలసివచ్చి ఆదివాసీ గూడెలలో పర్యటిస్తూ జాతి ప్రజలను చైతన్య పరచి తుడుందెబ్బ అభ్యర్థి ని గెల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో కుంజ నర్సింగరావు, కుంజ క్రిష్ణ,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ, మధుకర్, నగేష్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!