ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
కరకగూడెం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను స్థానిక ఎంఈఓ గడ్డం మంజుల ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు అనంతరం ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షులు మలకం కుమార్ స్వామి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలు భారత రాజ్యాంగ ఫలాలనందుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్ని సమస్యలకు మూలం చదువుకోవడమేనని చదువుకోవడం ద్వారానే వ్యక్తి పరిపూర్ణుడవుతాడని ఏజెన్సీ ప్రాంతంలో అందరూ చక్కగా చదువుకోవాలని ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వ్యవస్థ పై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మై పతి తిరుమలరావు కొమరం అశోక్ కుమార్ పోలేబోయిన రంజిత్ కుమార్ మహిళ అధ్యక్షురాలు తొలేం మౌనిక తదితరులు పాల్గొన్నారు