ఐటీడీఏ భద్రాచలం ఏజెన్సీ ఏరియా పరిధిలోని ఆదివాసి గిరిజన కుటుంబాల ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు అంతరించిపోకుండా నేటి తరానికి నేర్పిస్తూ ఆదివాసి గిరిజనులు

భద్రాచలం 01 ఫిబ్రవరి 24.

భద్రాచలం నేటి ధాత్రి

మంచి ప్రవర్తనతో జీవిస్తున్నారని, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పరిశోధన సంస్థ, అంతరో పాలాజికల్, సర్వే ఆఫ్ ఇండియా సభ్యులకు తెలిపారు.
గురువారం నాడు తెలంగాణ మరియు చత్తీస్గడ్ సరిహద్దు గ్రామాలలో నివసిస్తున్న ఆదివాసి గిరిజనులపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పరిశోధనా సంస్థ, అంతరోపాలాజికల్, సర్వే ఆఫ్ ఇండియా సాంస్కృతిక శాఖ బృందం వారు తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజన కుటుంబాల ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక సాంప్రదాయాల గురించి సర్వే చేయడానికి వచ్చిన బృందం సభ్యులకు ఆయన అభినందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజన కుటుంబాల సంక్షేమం కొరకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరుపేదలైన ప్రతి గిరిజన కుటుంబానికి చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే నిరుపేదలైన గిరిజన కుటుంబాలకు వైద్య చికిత్సల కొరకు గానీ, స్వయం ఉపాధితో జీవించడానికి నిరుద్యోగులైన గిరిజన యువతి ,యువకులకు ఆర్థిక వేసులుబాటు కల్పించడంతో పాటు ,నిరుద్యోగులైన గిరిజన యువతి, యువకులకు ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు కల్పించడం కొరకు వృత్తి శిక్షణలు ఇప్పించడం, గిరిజన విద్యార్థిని, విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల కళాశాలలు, గురుకుల పాఠశాలలు, అధునాతన హంగులతో నిర్మాణం చేపట్టి నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి,వారి విద్యాభివృద్ధికి చక్కటి మెనూతోపాటు అన్ని వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందని, మారుమూల గిరిజన గ్రామాలలో నివసించే గిరిజనులు అటవీ ఫలాలు సేకరణ, మధ్య దళారులు దోచుకోకుండా నేరుగా జి సి సి కె విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని, పేద గిరిజన రైతుల సంక్షేమం కొరకు కరెంటు, మోటార్లు, బోరు బావులు ఇప్పించడం జరిగిందని, నిరుపేదలైన గిరిజనులు చేపల వృత్తి ద్వారా జీవనోపాది పొందుతున్న గిరిజనులకు సొసైటీలు ఏర్పాటు చేసి, వారికి సబ్సిడీపై చేపల వృత్తికి సంబంధించిన సామాన్లు మరియు అమ్ముకోవడానికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఆదివాసి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వారికే చెందే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ గిరిజన సంక్షేమానికి పాటుపడుతున్నామని ఆయన బృందం సభ్యులకు తెలిపారు
అనంతరం కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పరిశోధన సంస్థ, అంతరోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇన్వెస్ట్ గెట్ కార్యాలయం, జగదల్పూర్ అధికారి డాక్టర్ పి ఎస్ రంగసాదు, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ మరియు చత్తీస్గడ్ సరిహద్దు గ్రామాలలో నివసిస్తున్న, గిరిజన ప్రజలపై పలు అంశాలపై పరిశోధన చేయటం జరిగిందని, 17 జనవరి 24 నుండి 31 జనవరి 24 వరకు మొత్తం 12 గ్రామాలు అనగా 6 చత్తీస్గడ్, ఆరు తెలంగాణ గ్రామాలను పర్యటించమని, ఈ గ్రామాలలో నివసిస్తున్న ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు మరియు వారి యొక్క భాష, వైవిధ్యాల గురించి, వారి కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, మరియు సరిహద్దు అవతల నివసిస్తున్నటువంటి రాష్ట్రాల ప్రజలతో సంబంధం బాంధవ్యాలు పిల్లలు పండుగలకు సంబంధించిన సమాచారము గ్రామస్తుల నుండి మరియు సర్పంచులు, పూజారులు, పటేళ్లు, అంగన్వాడీ టీచర్లు ,ఉపాధ్యాయుల సహకారంతో చాలా దిగ్విజయంగా సర్వే చేశామని, ఈ సర్వేకు ఐటీడీఏ భద్రాచలం అధికారులు ముఖ్యంగా ఏపీలో జనరల్ డేవిడ్ రాజ్ ,జి సి డి ఓ అలివేలు మంగతాయారు, కె వీరస్వామి సహాయ సహకారాలు ఎనలేనివని, ఇక్కడ సర్వే చేసిన ప్రతి అంశం మా రాష్ట్రంలోని గిరిజనులకు తెలియజేసి సాంస్కృతిక ,సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అంతరించిపోకుండా కాపాడుకోవడానికి మా వంతు సహకారం అందిస్తామని అలాగే ఐటీడీఏ ద్వారా నిరుపేద ఆదివాసి గిరిజన కుటుంబాలకు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరియు గిరిజన విద్యార్థిని విద్యార్థుల విద్యాభివృద్ధికి అందిస్తున్న సహకారం మహారాష్ట్రలో కూడా ప్రవేశ పెట్టడానికి కృషి చేస్తామని ఆయన పిఓకి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, జి సి డి ఓ అలివేలు మంగతాయారు, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి, బృందం సభ్యులు అనుపం దత్త, రాంబాబు, మౌనిక దేవి, డాక్టర్ లికె చంద్రడోల్, ప్రాంజలి రామ్ టేకి, రిషి కొల్పన్ రైస్, కోసం రత్నాకర్పలే, సంజనేర్ బేరా, తదితరులు పాల్గొన్నారు.
-అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడం అయినది-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!