పని మొదలుపెట్టిన‌ ఆదిత్య L1 సూర్యుడి దిశగా ప్రయాణం

Aditya-L1 is India’s first space-based solar mission to study the Sun. It was launched on September 2, 2023, by the Indian Space Research Organisation (ISRO) into a halo orbit around the Sun-Earth Lagrange point 1 (L1)

ఆదిత్య ఎల్‌-1 మిషన్​లో.. మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉపగ్రహ కక్ష్యను మరోసారి పెంచారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1 దిశలో విజయవంతంగా దానిని ప్రవేశపట్టారు.

సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో పంపిన ఆదిత్య ఎల్‌-1.. శాస్త్రీయ డేటాను సేకరించడం మొదలు పెట్టింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది. సోమవారం అర్థరాత్రి ఆదిత్య ఎల్‌-1 భూప్రదక్షిణ దశ ముగించుకుని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

భూమికి దాదాపు 50 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న సూప్ర థర్మల్‌, ఎనర్జిటిక్‌ అయాన్స్‌, ఎలక్ట్రాన్స్‌ను ఇది కొలుస్తుంది. ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది. వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్‌1లోని సూప్ర థర్మల్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ పార్టికల్‌ స్పెక్ట్రోమీటర్‌-స్టెప్స్‌ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. స్టెప్స్‌లో మొత్తం ఆరు సెన్సార్లు ఉన్నాయి.

విజయవంతం తర్వాత సూర్యుడిని పరిశోధించేందుకు సెప్టెంబర్‌ 2న ఆదిత్య-ఎల్‌ 1 ప్రయోగం చేపట్టింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. పీఎస్‌ఎల్‌వీ సీ-57 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు శాస్త్రవేత్తలు. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్‌ తరఫున సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్‌-1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలు పెడుతుంది ఆదిత్య ఎల్‌-1.

సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో పంపిన ఆదిత్య ఎల్‌-1.. శాస్త్రీయ డేటాను సేకరించడం మొదలు పెట్టింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *