వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో హరిమల ఫంక్షన్ హాల్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు ను శాలువాలు, పూలదండలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. సన్మాన గ్రహీత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కోసం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానన్నారు. అర్హులైన పేద ఆర్యవైశ్య సోదరులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఖాళీ స్థలం ఉన్నవారికి గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయలను అందజేసేందుకు కృషి చేస్తానన్నారు. తమ గెలుపు కోసం కృషి చేసిన ఆర్యవైశ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ఆర్యవైశ్య నాయకులు చికోటి శ్రీహరి, బాశెట్టి రవీందర్, చీకోటి నాగరాజు, కొత్త అనిల్, దైత కుమార్, సామ వీర వెంకటరమణయ్య, ఎర్ర శ్రీనివాస్ బచ్చు వెంకటేశం, చీకోటి ముక్తేశ్వర్, చికోటి అశోక్, బుస దశరథం బుస శ్రీనివాస్ పాత సత్యలక్ష్మి కాంగ్రెస్ నాయకులు పుల్కం రాజు, చిలుక రమేష్, కనికరపు రాకేష్, లతోపాటు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.