పండాల సతీష్ గౌడ్
కూకట్పల్లి జనవరి 6 నేటి ధాత్రి ఇంచార్జ్.
ఫతేనగర్ డివిజన్ పరిధిలో జరుగు తున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, జిహెచ్ఎంసి ఏఈ పవన్ తో కలసి శనివారం పర్యా వేక్షించారు.ఇందు లో భాగంగా సీసీ రోడ్ నిర్మాణం, దోబీ ఘాట్ భవన నిర్మాణ పనుల ను వారు సందర్శించారు.ఈ సంద ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అభివృద్ధి నిర్మాణ పనులను అధికా రులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించి సకాలంలో పనులు పూర్తి చెయ్యాల ని సూచించారు. డివిజన్ పరధిలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారా వు సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆయా ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చా రు. ప్రజలకు మెరుగైన వసతుల కల్పనేలక్ష్యంగా అభివృద్ధికి కృషి చేస్తున్ననామని తెలిపారు.ఈ కార్య క్రమంలో వీరేశంగుప్తా అశోక్ రజక ఎట్టయ్య స్వామి సురేంద్ర నాయు డు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 3లో….