
Urea Shortage
రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి
కేంద్ర ప్రభుత్వం రైతులకు,యూరియా పంపిణీ తగ్గించడం దుర్మార్గమైన చర్య
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు మానుకొని రైతులకు న్యాయం చేయాలి
ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపుల దోపిడి అరికట్టాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి ముషo రమేష్
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
ఈరోజు జిల్లా కేంద్రంలోని అమృత లాల్ శుక్ల కార్మిక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు వానకాలానికి సరిపోవు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు అలాగే జిల్లాలోని సహకార సంఘ గోదాముల వద్ద తెల్లవారుజాము నుండే బార్లు తీరుతున్న రైతుల బాధలు పట్టించుకునే నాధుడే లేడని అన్నారు ఇంత జరుగుతున్నా జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం జిల్లాలో యూరియా కొరతలేదని రైతులు ఆందోళన చెందవద్దని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు అలాగే ప్రైవేటు వ్యాపారులు కూడా ఇదే అదునుగా భావించి ఒక యూరియా బస్తా 310 రూపాయల నుండి 350 వరకు అమ్ముతూ యూరియాతోపాటు మిగతా పెటిలైజర్ కొంటేనే యూరియా ఇస్తామని అవసరం లేకున్నా దంటు గోళీలు గడ్డి మందు తదితర ఫెర్టిలైజర్ అంట కడుతున్నారని వారిపై వ్యవసాయ శాఖ ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు గతంలో ప్రతి సహకార సంఘ గోదాముల్లో నిల్వ ఉండే యూరియా బస్తాలు నేడు కనిపించడం లేదని యూరియా బస్తాలు కేటాయింపుల్లో కూడా పెద్ద రైతులు భూస్వాములు లైన్లో ఎక్కడ కనిపించడం లేదని ఎక్కడ చూసినా సన్నకారు చిన్న కారు రైతులే ఇబ్బందులు పడుతున్నారని మరి వారికి యూరియా ఎలా అందుతుందో అర్థం కావడం లేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సీజనకు సరిపడా యూరియా సప్లై చేయాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ,జవ్వాజి విమల పాల్గొన్నారు