ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాలేజ్ ముందు నిరసన
SFI జిల్లా కన్వీనర్ పట్ల మధు
తొర్రూర్ (డివిజన్ )నేటి ధాత్రి:
తొర్రూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరిపడా లెక్చరర్ లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పట్ల మాధవ్ అన్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ ,ఫీజక్స్,బాటనీ ,జూవాలజీ లెక్చరర్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు… సబ్జెక్టులకు సరిపరా లెక్చరర్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేరు అన్నారు ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజీలను అభివృద్ధి చేస్తుంది అనుకుంటూనే కనీసం కాలేజీలలో లెక్చరర్లను నియమించడం లేదు అన్నారు కావున తక్షణమే DIEO గారు స్పందించి లెక్చరర్లు నియమించాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్,మహేష్,వినయ్,ప్రణయ్,తదితరులు పాల్గొన్నారు