Velichala Rajender Rao Calls for Big Win in Urban Bank Polls
విశ్వాసనీయతకు చిరునామా
మా ప్యానల్
భారీ మెజార్టీతో గెలిపించండి
ఖాతాదారులకు రక్షణగా ఉంటాం – వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నేటిధాత్రి:
విశ్వాసంగా సేవలందించడమే ధ్యేయంగా మీముందుకు వచ్చిన మాపానల్ అభ్యర్థులను అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
విశ్వాసనీయతకు చిరునామా మాప్యానల్ అభ్యర్థులు అనీ ఏలాంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని ఎన్నికల్లో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం కరీంనగర్ లోని లేక్ పోలీస్ స్టేషన్, మానేరు డ్యాం కట్టపై అర్బన్ బ్యాంకు అభ్యర్థుల గెలుపు కోసం వెలిచాల రాజేందర్ రావు ప్రచారం చేశారు. ఈసందర్భంగా వాకర్సు, మహిళలు, సీనియర్ సిటిజన్స్, పలువురు ప్రతినిధులను కలిసి తమ ప్యానల్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వాకర్సు, స్విమ్మర్స్, క్రీడాకారులు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో రాజేందర్ రావు ప్రత్యేకంగా మాట్లాడారు. విశ్వాసంగా, అవినీతి రహితంగా సభ్యులు మెచ్చేలా, డిపాజిట్లకు రక్షణ కల్పించేలా వారిలో నమ్మకం కలిగేలా అర్బన్ బ్యాంకును తెలంగాణ రాష్ట్రంలోనే స్మార్ట్ బ్యాంకుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జాతీయ బ్యాంకులకు దీటుగా అర్బన్ బ్యాంకును తీర్చిదిద్దుతామని మెరుగైన సేవలు అందించేలా డిజిటలైజేషన్ హామీ ఇచ్చారు. ఖాతాదారులకు వెంట వెంటనే సేవలు అందేలా బ్యాంకును సంస్కరిస్తామని చెప్పారు. అర్బన్ బ్యాంకు అభివృద్ధిలో మాతండ్రి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ జగపతిరావు కీలక పాత్ర ఉందని తెలిపారు. గతంలో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నాలుగుసార్లు సొంతంగా ప్యానల్ ఏర్పాటు చేసి గెలిపించుకున్నారనీ, రెండుసార్లు ముద్దసాని కనుకయ్య, ఒకసారి బొమ్మరాతి రాజేశం మరోసారి డి శంకర్ కు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా అవకాశం కల్పించారని తెలిపారు. తన తండ్రి అర్బన్ బ్యాంకు అభివృద్ధికి ఏవిధంగా కృషి చేశారో అదే విధంగా తాను ముందుండి బ్యాంకును అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తాను ముందుండి బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తాననీ, ఎక్కడికెళ్లినా అర్బన్ బ్యాంక్ మెంబర్లు తమ ప్యానెల్ కు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారనీ, వారినీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానల్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజేందర్ రావు కోరారు. గతంలో అవినీతి ఆరోపణలు చేసుకున్న వారు ఎన్నికలను ఆపిన వారు మళ్లీ అధికారం కోసం ప్రాకులాడుతున్నారనీ, వారి పట్ల అర్బన్ బ్యాంక్ మెంబర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వారు మళ్లీ ముందుకు వచ్చి ఓట్లు అడగడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. అర్బన్ బ్యాంక్ మెంబర్లు అప్రమత్తంగా ఉండి తమ ప్యానెల్ ను ఆదరించాలని రాజేందర్ రావు కోరారు. ఈకార్యక్రమంలో అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి, ఇ లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దామెర శ్రీలత రెడ్డి కాంగ్రెస్ నాయకులు, ఆకుల ఉదయ్ అనంతుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
