ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం జరుగుతుందని రాబోయే రోజుల్లో మరింతఅభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అవుతుందని జనం బలంగా నమ్ముతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మద్దతు తెలుపుతూ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం మండలంలోని బోల్లోని పల్లి, శనిగరం గ్రామాల నుండికాంగ్రెస్, బిజెపి పార్టీకి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో గులాబి దళంలో చేరారు ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పెద్ది గులాబీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఊడుగులప్రవీణ్ గౌడ్, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్, నాయకులు గందె శ్రీనివాస్ గుప్తా, కొత్తపెళ్లి కోటిలింగాచారి, ఇంగ్లీ శివాజీ,పార్టీలో చేరిన వారు తిప్పని రవీందర్ గౌడ్, జనగాం నాగేశ్వరరావు, జక్కి ప్రభాకర్, మాదాసు రాజమౌళి, పోలు దాసరి రవీందర్, గాజర్ల సారంగపాణి గౌడ్, మాదాసి రాజు గౌడ్, నీలం రవి, మొద్దు నరేష్, సమ్మాలు, కొలగాని రమేష్ గౌడ్, బూర రాజా గౌడ్, గండు సదయ్య తదితరులు ఉన్నారు.