
Telugu and Hindi teacher
200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు హిందీ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి.
రాయికల్, జూలై 30, నేటి ధాత్రి:
సర్దుబాటు, డిఫ్యూటేషన్, నియామకాల్లో, సర్దుబాటు, డిప్యూటేషన్స్ లలో 200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు, హిందీ, అన్ని సబ్జెక్టులకు పోస్టులు మంజూరు చేయాలని భూపతిపూర్ ఉన్నత పాఠశాల లో జరిగిన రాయికల్, మేడిపల్లి, భీమారం మండలాల హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం విరామ సమయంలో హిందీ ఉపాధ్యాయులందరు మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులుకు ప్రాతినిధ్యం చేసారు. కాంప్లెక్స్ సమావేశం ను సందర్శించిన మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసి పలు సమస్యలు దృష్టికి తీసుకపోయారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో హిందీ నీ ప్రవేశపెట్టి తెలుగు హిందీ పండితులను నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణీ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, పిఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య, వసంతరావు, సయీద్ పాషా, జోంగోని రాజేశం, శంకరయ్య, నీలిమ, జంగిలి రాజేశం, కూరగాయల సురేష్, సుజాత, ధనలక్ష్మి, నారాయణ, రమేష్, గంగాధర్, మారుతి, నరహరి కాంప్లెక్స్ హిందీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.