Additional Collector Inspects KGBV School
కేజీవీపీ ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి.
#ప్రతి సబ్జెక్టులో ప్రతిభను ప్రతి విద్యార్థి పెంపొందించుకోవాలి.
#మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి.
#విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తనిఖీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టి వారితో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సమాజంలో నిలదోక్కోవాలంటే చదువు చాలా ముఖ్యం.

దానికోసం ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్టులో ఇష్టం ఏర్పరచుకొని విజయం సాధించే దిశగా ప్రయాణం కొనసాగించాలని. అలాగే విద్యతో పాటు తమకు నచ్చిన వివిధ రంగాలలో నైపుణ్యాన్ని పెంపొదించుకునే విధంగా విద్యార్థులు అలవర్చుకోవాలని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు భోజనం చేసేందుకు డైనింగ్ టేబుల్ లేవని అదనపు కలెక్టర్ కు తెలియజేయడంతో స్పందించిన ఆమె త్వరలోనే డైనింగ్ టేబుల్ అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూమ్ ను, వంటశాల గది లోని కూరగాయలను, మెనూ ప్రకారం భోజనాన్ని పరిశీలించి కుళ్ళిపోయిన కూరగాయలు, ఉల్లిపాయలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఇలాంటి నాణ్యతలేని కూరగాయలను వెంటనే తీసివేయాలని పాఠశాల వంట మనుషులను ఆదేశించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని అన్నారు. అలాగే విద్యార్థినిలతోకలిసి భోజన సమయంలో భోజనం చేస్తూ వారితో మాటా మంతి చేశారు. ఆమె వెంట ఎంపీడీవో శుభ నివాస్, పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్, జ్యోతి, ఉపాధ్యా బృందం, రెవిన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
