‘నేటిధాత్రి”, డిసెంబర్ 5, 2025.
“ఏసీబీ”కి చిక్కిన అవినీతి తిమింగలం.
హనుమకొండ “అడిషనల్ కలెక్టర్”, ఇన్చార్జి “డీఈవో” గా ఉన్న “వెంకట్ రెడ్డి”ని ట్రాప్ చేసిన “ఎసిబి”.
పుత్తూరు హై స్కూల్ అనుమతి పునరుద్ధరణకు 60000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న “ఏసీబీ” అధికారులు.
ఆయనతోపాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను కూడా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.
హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ “వెంకట్ రెడ్డి” ఏసీబీ వలలో చిక్కారు.. జిల్లా “అడిషనల్ కలెక్టర్” గా కొనసాగుతూ ఇంచార్జ్ “డిఈఓ” గా ఉన్న వెంకట్ రెడ్డి ఓ పాఠశాల విషయంలో “లంచం” తీసుకుంటుండగా “ఎసిబి” వలపన్ని పట్టుకున్నట్లు తెలిసింది.
