పార్టీ రజతోత్సవ సభకు కార్యకర్తలు రావాలి
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
గుడాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి:
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా పార్టీ నిర్వహించే రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు ఈ నెల 27 నా తరలిరావాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కోరారు. శనివారం మండలం పరిధిలోని దామరతోగు గ్రామంలో రజతోత్సవ సభ పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో పార్టీ రజతోత్సవాన్ని కేంద్ర పార్టీ అట్టహాసంగా నిర్వహిస్తుందని అన్నారు.వరంగల్ జిల్లా ఎలక తుత్తి వద్ద జరిగే ఈ సభను పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చి ప్రసంగించే ప్రసంగాన్ని తిలకించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమన్న, పార్టీ సీనియర్ నాయకులు, సుతారి సత్యం, కుంజ నాగేశ్వరరావు, పాయం శ్రీను, గడ్డం వీరన్న, తాటి కృష్ణ, బొమ్మెర్ల శ్రీను, గోగ్గల రాంబాబు, పొంబొన సుధాకర్, బొమ్మెర్ల పద్మారావు, బొమ్మెర్ల సతీష్, మోకాళ్ళ నరేష్, తదితరులు పాల్గొన్నారు.