# మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
# ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం ఇoన్చార్జిల నియామకం
నర్సంపేట,నేటిధాత్రి :
రాబోయే పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గం పరిధిలో అర్హత గల పట్టభద్రులను ఓటరు నమోదు చేయించడంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ 2020 నవంబర్ లోపు డిగ్రీ పాసైన ప్రతీ ఒక్కరూ ఓటును తప్పనిసరిగా నమోదు చేయించి వారిని చైతన్య పరచాలన్నారు.గతంలో ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ మరల కొత్తగా నమోదు చేయించుకోవాలని సూచించారు.అందుకు గాను ఓటు నమోదుకు చివరి తేదీ వచ్చే ఫిబ్రవరి నెల 6 అని పేర్కొన్నారు.మండల పార్టీ అధ్యక్షుల పర్యవేక్షణలో ఓటర్ నమోదు కార్యక్రమం ప్రతీ గ్రామంలో విస్తృతంగా చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని మండలాల వారీగా ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం ఇoన్చార్జిల వివరాలు ఆయన వెల్లడించారు.
# పరిధిలోని మండలాల వారీగా ఇoన్చార్జిల వివరాలు..
1).నల్లబెల్లి మండల ఇంఛార్జీలు…
నోటంకి సూరయ్య ,
బొట్ల పవన్.
2). దుగ్గొండి మండల ఇంఛార్జీలు….
శానబోయిన రాజ్ కుమార్,
యాదగిరి సుధాకర్.
3). నెక్కొండ మండల ఇంఛార్జీలు….
కొమ్ము రమేష్ యాదవ్,
జాటోత్ రమేష్.
4). నర్సంపేట రూరల్ మండల ఇంఛార్జీలు….
మోటూరు రవి,
పిన్నింటి దేవేందర్ రెడ్డి.
5(. ఖానాపూర్ మండల ఇంఛార్జీలు….
ఎస్కే మస్తాన్,
వేల్పుల లింగయ్య.
6).నర్సంపేట మున్సిపాలిటీ ఇంఛార్జీలు….
గోనే యువరాజు,
రాయిడి దుష్యంత్ రెడ్డి.
7). చెన్నారావుపేట మండల ఇంఛార్జీలు….
బాల్నె వెంకన్న గౌడ్,
కంది కృష్ణ చైతన్య రెడ్డి.