రౌడీ షీటర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై.దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్కు పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ వారి జీవన విధానంతో పాటు, ప్రస్తుత వారి కుటుంబం స్థితిగతులను గురించి అడిగి తెలుసుకుని, గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు నేర ప్రవృత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు. శాంతి భద్రతలకు మరియు ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని,రౌడీ షీటర్లపై పిడి యాక్ట్ పెట్టేందుకు సైతం వెనకాడమన్నారు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి చెడు ప్రవర్తన కలిగిన వారిని బైన్డోవర్ చేయడం వలన వారిపై పోలీస్ నిఘా ఉంటుంది కాబట్టి వారి కదలికలు మరియు ప్రవర్తన గురించిన విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది.
బైండొవర్ కాలంలో ఏదైనా నేరం కు పాల్పడినట్లు అయితే జరిమానా తో పాటు గా జైలు శిక్ష ల కూడా పడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సత్పవర్తనతో మెలగాలి, చట్టవిరుద్ధంగా పని చేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని, సమాజానికి హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు ఎస్పై దీకొండ రమేష్ అన్నారు.