పురుగుమందు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన టెక్నికల్ ఏ డి ఏ విజయ్ చంద్ర.
నల్లబెల్లి, నేటి ధాత్రి: అనుమతి లేని పురుగుమందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టెక్నికల్ ఏ డి ఏ విజయ్ చంద్ర పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి ఆర్ పరమేశ్వర్ తో కలిసి పలు దుకాణాలను తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రతి డీలర్ పురుగుమందులు రైతులకు విక్రయించే క్రమంలో తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని అలాగే సంబంధిత కంపెనీలకు చెందిన అనుమతి పత్రాలను తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలని లేనియెడల లైసెన్సును రద్దు చేయబడుతుందని సదరు డీలర్లకు సూచన చేశారు అదేవిధంగా ఎరువులను విక్రయించే సమయంలో ఈ పాస్ ద్వారా నమోదు చేసి ఎరువులను విక్రయించాలని బయో మందులు విక్రయిస్తే తప్పనిసరిగా కోర్టు అనుమతితో ఉన్న జి టు ఫామ్ పత్రాలు కలిగి ఉండాలని తనిఖీలో భాగంగా కొందరి డీలర్ల వద్ద పురుగుమందుల కంపెనీకి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో డీలర్లకు నోటీసులు జారీ చేసి సరుకుల విక్రయాలను నిలుపుదల చేయడం జరిగిందని ఎరువులు పురుగు మందులు విక్రయించే ప్రతి షాప్ యజమాని తప్పనిసరిగా ప్రభుత్వ ఆమోదిత పొందిన వాటిని మాత్రమే విక్రయించాలని దీనిని ఎవరు ఉల్లంఘించిన తగిన చర్యలు తప్పవని ఆయన పలువురి దుకాణ యాజమానులను హెచ్చరించారు.