Strict Action Against Anti-Social Activities
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు.
డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కు పాదం.
ఎస్సై రాజేష్.
నిజాంపేట: నేటి ధాత్రి
చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై రాజేష్ హెచ్చరించారు. బుధవారం నిజాంపేట మండల కేంద్రంలో గల వివిధ హోటల్, పాన్ షాప్, దాబాలు, ఆటో స్టాండ్, బహిరంగ ప్రదేశాల్లో బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ తో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ. డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
