మద్యం మాఫియాకు చర్యలు ఉండవా..
ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలి.
.ప్రతి కిరాణా కొట్టు బెల్ట్ షాపే.
వసూళ్ల మత్తులో సమందిత అధికారులు…
బెల్ట్ షాపులు నివారించడంలో చర్యలు శూన్యం.
మద్యం చట్టాన్ని అనుసరించే అధికారులు ఎక్కడ.
ప్రతి మద్యం షాప్ వద్ద ధరలు పట్టిక ఏర్పాటు చేయాలి…
నూగుర్ వెంకటాపురం(నేటి దాత్రి ):-
ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో గ్రామపంచాయతీలో ప్రతి గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, మారుమూల ( ఏజెన్సీ) గ్రామాలలోచల్లని కుటుంబాలలో మద్యం బెల్ట్ షాపులు నిప్పులు కురిపిస్తున్నాయి. వీధి వీధినా మద్యానికి బానిస కావడం వల్ల భార్య భర్తలు మధ్యగొడవలు వెంకటాపురం, వాజేడు, మండలాల్లో గ్రామపంచాయతీ పరిధిలో వీధి వీధి మద్యం బెల్ షాప్ లు నిర్వహిస్తున్నారు. అని ఆదివాసి సంఘాలు అంటున్నాయి.జోరుగా ఉషాగా మద్యం, బెల్ట్ షాపులు, ఏరులై పారుతుండటం వల్ల కొన్ని కుటుంబాలు మద్యానికి బానిసలై అనారోగ్య ఫాలు అవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి యువత, యువకులు మద్యానికి బానిసలుగా అవుతున్నారని మద్యం వల్ల జీవన మరణ సమస్యలు ఆరోగ్య సమస్యలు అనేక సమస్యలు మద్య బంగారు కుటుంబాలు నలిగి పోతున్నాయని , మద్యం చట్టం ప్రకారం అనుసరించాలని, విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు గ్రామ గ్రామాన వీధి వీధిన వెలుస్తూ న్నాయని ప్రజలు మాట్లాడుతున్నారు. మద్యానికి సంబంధిత అధికారులు విచ్చలవిడిగా నిర్వహించకుండా కంట్రోల్ చేయాలని ఎమ్మార్పీ ధరలు పట్టిక ఏర్పాటు చేయాలని, మద్యం షాపులో 20 నుంచి 30 రూపాయల వరకు అదనంగా లాభంఘటిస్తున్నారని, బెల్ట్ షాపుల్లో ప్రతి బీరుకు 200 రూపాయలు కు అదనంగా 50 రూపాయలు దోసుకుంటున్నారు అని క్వార్టర్ సీసా 220 రూపాయలు ఉంటే, అదనంగా 30 నుంచి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు.