Strict Action on Election Violations: Sircilla DSP
ఎన్నికల నియమావళిని ఉల్లంఘింస్తే చర్యలు తప్పవు: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా,విక్రయాలు,కొనుగోళ్లపై ప్రత్యేక నిఘా.
ఎన్నికల సందర్భంగా హోల్సేల్ రూపంలో భారీగా మద్యం ఆమ్మిన వారిపై,కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుండి 90 కేసుల్లో 1337 లీటర్ల అక్రమ మద్యం సీజ్.
సిరిసిల్ల(నేటి ధాత్రి):
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అక్రమ మద్యం రవాణా,విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,ఎన్నికల సమయంలో హోల్సేల్ రూపంలో భారీగా మద్యం ఆమ్మిన వారిపై ,కొనుగోలు చేసిన వారిపై నిఘా కఠినతరం చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా డిఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 90 కేసుల్లో 1337 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు వెల్లడించారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నామని,ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని , ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చట్టపరమైన తీసుకుంటామని,ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అన్నారు.
