ఎమ్మార్పీఎస్ హన్మకొండ అధ్యక్షులు సుకుమార్ మాదిగ డిమాండ్
నేటిధాత్రి,వరంగల్
హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ లో జర్నలిస్టు కృష్ణకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ డిమాండ్ చేశారు. జర్నలిస్టు కృష్ణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సుకుమార్ మాదిగ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల జర్నలిస్టు కృష్ణ ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలలపాటు మంచానికి పరిమితం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఏడాది 21 జూలైన చేసిన అపెండిక్స్ ఆపరేషన్ వికటించిన విషయం చెప్పకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే జర్నలిస్టు కృష్ణకు ఆ పరిస్థితి వచ్చిందని అన్నారు. కావున అధికారులు త్వరగా స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని పేర్కొన్నారు.