
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామం చెరువులో అక్రమంగా బోరు మోటర్లు వేసి రెండు మూడు కిలోమీటర్ల దూరం పైపులు వేసుకొని నీటిని వాడుకుంటున్నారు మోటర్లు వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మోటర్లు సీజ్ చేయాలని గండీడ్ మండల తాహసిల్దార్ నాగలక్ష్మి కి మెమోరండం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పగిడ్యాల్ గ్రామం ఎంపిటిసి నీరెటి కృష్ణయ్య ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, హస్నాబాద్ వెంకటయ్య, సంగేమ్ కృష్ణయ్య, కావలి కృష్ణయ్య, కావాలి అంజి, తోక కృష్ణయ్య, కావలి కురుమయ్య, కర్రె బచ్చప్ప, మహమ్మదాబాద్ రాములు, బోరు పెద్ద కృష్ణయ్య, మహమ్మదాబాద్ బాబు,చెంచు తిరుమలయ్య, కుమ్మరి నర్సింలు ,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.