మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి.

# ప్రభుత్వ నియమాలు పాటించని నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్.

# ఏబిఎస్ఎఫ్, పిడిఎస్యు,ఎంఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముందు నిరసన.

నర్సంపేట,నేటిధాత్రి :

ప్రభుత్వ నియమాలు పాటించని నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్యా కిషన్ పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని
ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్,పిడిఎస్యు జిల్లా కార్యదర్శి అల్వాల నరేష్ డిమాండ్ చేశారు.ఈ
నేపథ్యంలో ఏబిఎస్ఎఫ్, పిడిఎస్యు,ఎంఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశారు.అనంతరం వారు
మాట్లాడుతూ నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ శాఖలో ఖాళీలు ఉన్న,పోస్టులను భర్తీ చేయడం గురించి గత నెల 19 న వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ కిషన్ లు నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.ఆ నోటిఫికేషన్, చూసి నర్సంపేట డివిజన్లోని వివిధ మండలాల నిరుద్యోగులు అర్హత ఆధారంగా, దరఖాస్తు చేసుకోగా గురువారం రోజు మెరిట్ మరియు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం సహజం. కానీ నర్సంపేట మెడికల్ కళాశాలలో దానికి భిన్నంగా అదనంగా మరో 20 పోస్టులకు, ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్,సంబంధిత ఏజెన్సీ వాళ్లు ఎంపిక చేయడం, నిరుద్యోగులు, ఆశ్చర్యానికి గురైన సంఘటన ఎదురైందని ఆరోపించారు. నర్సంపేట మెడికల్ కళాశాల పట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం పాటించకుండా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా 20 పోస్టులను భర్తీ చేయడం పట్ల ఖండిస్తూ వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి, ప్రభుత్వ ఆదేశాలు పాటించని నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేసి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా 20 పోస్టులు భర్తీ చేసిన వాటిని రద్దుచేసి నోటిఫికేషన్ విడుదల చేసి మళ్లీ ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షాన విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి ప్రజా సంఘాల, ఆధ్వర్యంలో ఆందోళ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు సాయి, ప్రశాంత్,భూషణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!