బ్రిలియంట్ హైస్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి.

# ఏబిఎస్ఎఫ్ ఎమ్మెస్ఎఫ్ విద్యార్థి సంఘాల డిమాండ్.

నర్సంపేట,నేటిధాత్రి :

విద్యార్థిని చితకబాదిన ప్రైవేట్ బ్రిలియంట్ స్కూల్ ల్యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏబిఎస్ఎఫ్ ఎమ్మెస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఏబిఎస్ఎఫ్ ఎమ్మెస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవో ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓ శ్రీనివాస్ రావు ద్వారా వినతి పత్రం అందజేశారు.అనంతరం ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని ప్రైవేట్ బ్రిలియంట్ హైస్కూల్లో గత నెల 30 శనివారం రోజున విద్యార్థిని చితకబాదిన సంఘటనపై విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థిని చితకబాదిన టీచర్ పై అలాగే ప్రైవేట్ పాఠశాల బ్రిలియంట్ యాజమాన్యం చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా ఆర్డీవో ద్వారా జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతం సిద్దు, రవితేజ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!