రైతుల పైన దాడి చేసిన గుమాస్తాలపై చర్యలు తీసుకోవాలి

వరంగల్ లక్ష్మీపురం కురగాయల మార్కెట్లో రైతులపై దాడి చేసిన గుమస్తాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

__@తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమీడి శ్రీనివాస్

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ లక్ష్మీపురం కురగాయల మార్కెట్లో రైతులపై దాడి చేసిన గుమస్తాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమీడి శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరుగాలం ఎండనక వాననక పంటలు పండిస్తూ దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతులపై, వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కి కూరగాయలు తీసుకువచ్చిన రైతులపై దాడి చేయడం అమానుషం అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమీడి శ్రీనివాస్ అన్నాడు. రైతులు నిత్యం లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ కు రోజువారిగా వస్తున్నట్లుగానే కూరగాయలు అమ్ముకోవడానికి శుక్రవారం రాత్రి మూడు గంటలకు మార్కెట్ కు కూరగాయలు తీసుకురాగా, షాప్ నంబర్ 98లో పనిచేస్తున్న గుమస్తా సునీల్, రంజిత్ మరియు వినోద్ వీరితో పాటుగా మరికొందరు కలిసి, గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన రైతులు సయింపు వెంకటేశ్వరరావు, వంజరపల్లి గ్రామ రైతు సిరుల రవీందర్ లను విపరీతంగా కొట్టడం జరిగింది అని, రైతులు పండించిన పంటను ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే విధంగా ఉండాలని ప్రభుత్వాలు ఓ పక్కన చెప్తుంటే మరో పక్కన రైతులు స్వేచ్ఛగా పంటను అమ్ముకోకుండా భయాందోళనకు గురిచేస్తూ పంటను తక్కువ ధరకు అమ్ముకునే విధంగా మార్కెట్లో రైతులను పెట్టుబడి దారులు మోసం చేయడం జరుగుతున్నది అని అన్నారు. ఈ రైతుల పై దాడి చేసిన వ్యక్తులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని, రైతులపై దాడి చేసిన వారిపై పీడీ యాక్ట్ పెట్టి మరొక్కసారి ఏ రైతుపై దాడి చేయకుండా ప్రభుత్వం చూసే విధంగా స్వేచ్ఛగా పంటను అమ్ముకునే విధంగా సదుపాయాలు వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ లో ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా కోరడం జరిగినది. వీరిపై ఇంతేజార్ గoజ్ పోలీస్ స్టేషన్లో రైతులు ఈరోజు వారిపై పిర్యాదు చేయడం జరిగినది. రైతులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున రైతాంగాన్ని కదిలించి రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా కార్యదర్శి ఓదెల రాజయ్య, బాధితుల సిరుల రవీందర్, సయింపు వెంకటేశ్వరరావు, రాంబాబు, బుచ్చిరెడ్డి ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!