
# ఏబిఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్,ఏఐఎఫ్ డిఎస్, ఏఐఎస్బి సంఘాల డిమాండ్,
# ఆయా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డీఈఓ కు వినతి పత్రం.
నర్సంపేట నేటిధాత్రి :
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పుస్తకాలను విక్రయించేందుకు ఒక ప్రైవేటు గదిలో భద్రపరిచిన నర్సంపేట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఏబిఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్,ఏఐఎఫ్ డిఎస్, ఏఐఎస్బి సంఘాల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా సంఘాల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని వాసంతికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లాదెళ్ల శరత్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం ఈనెల 6 న 2024 – 2025 విద్యా సంవత్సరం కోసం ముందస్తుగా ఒక ప్రైవేట్ వాహనంలో ( టీఎస్ 07 యుహెచ్ 9327) ద్వారా నర్సంపేట పట్టణంలో ఒక అద్దె భవనంలో పాఠ్యపుస్తకాలు భద్రపరుస్తున్న తరుణంలో విద్యార్థి సంఘాల నాయకుమైన మేము నిలదీయక పొంతన లేని సమాధానం చెప్పుకుంటూ ప్రభుత్వ నియమాలు పాటించకుండా పాఠ్యపుస్తకాలల మీద శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పేరుతో ముద్రించిన విక్రయానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి సమాచార ఇవ్వడంతో సంబంధిత సిబ్బందిని పంపడం జరిగిందని, సిబ్బంది సమక్షంలో పాఠ్య పుస్తకాలల మీద శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పేరు సైతం ఉండడం ఆశ్చర్యం గురి చేసిన సంఘటన నర్సంపేటలో నెలకొందని వారు పేర్కొన్నారు. సంబంధిత మండల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరితో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం పాఠ్యపుస్తకాలు వేరొక చోటకు తరలిస్తుండగా చేసేదేమీ లేదు అన్నట్టుగా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు చూశారని పేర్కొన్నారు.ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే స్పందించి ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఐక్య విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారి కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ సంఘ నాయకుడు ప్రవీన్ ఏఐఎస్బి సంఘ నాయకుదు సతీష్ పాల్గొన్నారు.