శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
సోతుకు.ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీ చైతన్య పాఠశాలను నడిపిస్తున్నారని అన్నారు. శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజులు కట్టని విద్యార్థులను గంటల తరబడి క్లాస్ రూమ్ ముందు నిలబెట్టుతున్నారని, వారికి ఎటువంటి పరీక్షలకు అనుమతించకుండా విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ క్వాలిఫై టీచర్లు లేకుండా డిగ్రీలు పూర్తయిన వారితో చదువు చెప్పిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు చదువు చెప్పాలంటే తప్పకుండా ఉపాధ్యాయునికి బిఈడి పూర్తయి ఉండాలని నిబంధన శ్రీ చైతన్య పాఠశాల పాటించడం లేదని అన్నారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలను తనిఖీ చేసి ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బంది గురి చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. బుక్స్ యూనిఫామ్ ఇతర పేర్ల మీద అనేక వాసులకు పాల్పడుతున్నారని ఈ దోపిడిని అరికట్టాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులకు ఉందని గుర్తు చేశారు. శ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, ఎండి అలీమ్ పాషా, అజయ్, హైమద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
