కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయం తథ్యం

మల్కాజ్ గిరిలో ఈటల ఓటమి ఖాయం: కూకట్ పల్లి నియోజకవ ర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి

కూకట్పల్లి మే 8 నేటి ధాత్రి త్రి ఇంచార్జీ

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఓటర్లను అవమానపరిచిన బిజెపి అభ్యర్థి ఈ టెల రాజేందర్ మల్కాజ్ గిరి పార్ల
మెంట్ ఓటర్లకు క్షమాపణ చెప్పాల ని కూకట్ పల్లి మున్సిపాలిటీ నియో జకవర్గం కగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.మ ల్కాజ్ గిరి ఓటర్లు డబ్బులు,మద్యం తీసుకుని ఓట్లు వేస్తారని మాట్లాడ
డం విడ్డూరంగా ఉందన్నారు.మ ల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు విజ్ఞులు మేధావులని,వారికి
వెంటనే ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.పట్నం సునీత మహేందర్ రెడ్డి ఉమ్మడి రం గారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సేవలందించారు అసలు నిజంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి పక్కా లోకల్ అన్నారు. రాజేందర్.. 2001 నుంచి 2021 వరకు ఇరవైఏళ్లు కేసీ ఆర్ తో కలిసి తెలంగాణను విధ్వం సం చేసింది మీరు కాదా అని ప్రశ్నిం చారు. మీకు పంపకాల్లో పంచాయి తీతో విడిపోయారు తప్ప ప్రజల కో సం కాదు.. 2021లో వరదలు వచ్చి
ఈ ప్రాంతం ముంపుకు గురైతే ఆనా డు ఈటెల పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పదేళ్లు మంత్రిగా ఉం డి ఏనాడైనా మల్కాజ్గిరిపార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకికు వచ్చా వా..? నువ్ ఏం చేశావని.. ఏం తె చ్చావని మల్కాజిగిరి ప్రజలను ఓటు అడుగుతాన్నావన్నారు.మ ల్కాజిగిరి ప్రజలనుఓటు అడిగే
హక్కు నీకు లేదు..రాజేందర్,కేసీఆర్ వేర్వేరు కాదు..నాణానికి బొమ్మా బొరుసు లాంటి వారు.. కేసీఆర్
కాళేశ్వరం పేరుతో దోచుకుంటుంటే ఆర్ధిక మంత్రిగా నిధులు విడుదల చే సింది నువ్వు కాదా రాజేందర్.. కరో నా సమయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు కోట్లాది రూపా యలు వెనకేసు కుంటుంటే.. వైద్యా రోగ్య శాఖ మంత్రిగా ఉన్నది ఈటల రాజేందర్ కాదా అని ప్రశ్నించా రు.నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్..అప్పుడే మర్చిపోయావా?హైదరాబాద్ చుట్టు భూములను దోచుకుం టుం టే..చూస్తూ ఊరుకుంది నువ్వు కాదా? కేసీఆర్ అవినీతిపై ఈటెల ఏనాడైనా అమిత్ షా,మోదీకి పిర్యా దు చేశారా?ఈటెల,కేసీఆర్ది పగలు కుస్తీ.. చీకట్లో దోస్తీ..ఈటలకు పదవి, పరపతి తప్ప..తెలంగాణ ప్రజల సం
క్షేమం పట్టదు..రిజ ర్వేషన్లు రద్దు చే సే బీజేపీ వైపు ఉంటారో… ఎస్సీ,ఎ స్టీ,బీసీల వైపు ఉంటారో రాజేందర్ తేల్చుకోవా లన్నారు.అంగీమార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషా లు వేసినా రాజేందర్ ను ప్రజలు నమ్మ రు..మోదీ తెలంగా ణకు ఇచ్చిందేం లేదు.. గాడిద గుడ్డు తప్ప..మల్కా జిగిరి పార్లమెంట్ లో సునీతక్కను లక్ష ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపి
స్తారని శేరి సతీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!