ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

# తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇల్లును కూల్చేసిన చిరంజీవి,కుమార్..
# ఇళ్లు,ఖాళీ స్థలాన్ని 2017 లో ప్రభుత్వానికి ఇనాం గా ఇచ్చారు..
# జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన భాజపా నాయకులు..

నర్సంపేట,నేటిధాత్రి :

ప్రభుత్వానికి ఇనాముగా ఇచ్చిన ఇంటిని ఖాళీ స్థలాన్ని కబ్జాకు పాల్పడిన ప్రైవేట్ వ్యక్తులపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ మాజీ అధ్యక్షుడు బాల్నే జగన్,భాజపా దళిత మోర్చా జిల్లా కో కన్వీనర్ కె.పృధ్వీరాజ్ కోరారు. ఈ సందర్భంగా జగన్, కె.పృధ్వీరాజ్ లు మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల 1-712/1 నంబర్ గల ఇంటిని అలాగే ఖాళీ స్థలాన్ని ఇంటి యజమాని అయిన పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్ రావు తల్లి పారిజాతం పేరు మీద ఉండగా 2017 సంవత్సరంలో ఆనాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సాక్షిగా అప్పటి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అట్టి భూమిని ఇంటిని ప్రభుత్వానికి ఇనాముగా ఇస్తూ ఇంటి భూమి డాక్యుమెంట్లను ప్రజల సమక్షంలో అందజేశారన్నారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లు ,ఖాళీ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సైతం ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయన్నారు. నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి, కుమార్ అనే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఇంటిని, ఖాళీ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా కబ్జాకు పాల్పడిన వ్యక్తులు తమకు పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్ రావు అమ్మారని తెలపడం విడ్డూరంగా ఉందని అన్నారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కబ్జా చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి ఇనాముగా ఇచ్చిన ఆ భూమిని కాపాడాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నట్లు జగన్, పృధ్విరాజ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!