నాణ్యత ప్రమాణాలు పాటించని మైత్రి హోటల్ పై వెంటనే కేసు నమోదు చేయాలి – బ్రాహ్మణపల్లి యుగంధర్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలో చాలా హోటల్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు, రెస్టారెంట్ లు కల్తీ వస్తువులను తయారీలో వాడుతూ ప్రజలను అనారోగ్యాలకు గురిచేస్తున్నారని వీటిపై ప్రభుత్వం తనిఖీలు చేసి కల్తీ ఆహారం తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో ఫుడ్ అధికారుల కొరత ఉందని ఒక అధికారి పది జిల్లాలకు ఇంచార్జిగా వుండడం వల్ల వ్యాపారస్తులు ఇష్టరాజ్యంగా వ్యవరిస్తున్నారని వెంటనే ఫుడ్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆహార పదార్థాలు నాణ్యత లేకున్న ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఫుడ్ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని దీంతో హోటల్ యజమానులు యదేచ్చగా మళ్లీ కుళ్ళిపోయిన వంటలను వండుతున్నారని నిత్యం తనిఖీలు లేకపోవడం వల్ల ఇస్టారీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మైత్రి హోటల్లో తనిఖీలు చేసిన అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరించారని వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. ఎక్కడ హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వాహనాలు నిలుపుకునేందుకు పార్కింగ్ స్థలం లేదని ఇష్టం వచ్చినట్లు రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్న ట్రాఫిక్ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు.
వెంటనే అధికారులు నాణ్యత, అధిక ధరలు వసూలు చేస్తున్న హోటల్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, రెస్టారెంట్ లపై తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని యుగంధర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.