సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ కి వినతిపత్రం
పరకాల నేటిధాత్రి
మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమగృహ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో 4,9,15,18,19, వార్డుల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్నాయని వ్యాపార సముదాయాలు సైతం అనుమతి మేరకు కాకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు నిర్మిస్తున్నారని పట్టణ టౌన్ ప్లానింగ్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనేక నిర్మాణాలు అనుమతులు లేకుండానే పట్టణ పరిధిలో కొనసాగుతున్నాయన్నారు.నూతన భవన నిర్మాణాల పట్ల తక్షణమే విచారణ జరిపించి భవిష్యత్ కాలంలో ఇబ్బందులకు దారి కాకుండా వెంటనే విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కళ్యాణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హేమంత్,ఈశ్వర్ పాల్గొన్నారు.