
తుడుందెబ్బ డిమాండ్.
నేటిధాత్రి.కొత్తగూడ.
కొత్తగూడ మండలం లోని ఆదివాసీల ఆరాధ్య దైవం శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర ప్రాంగణం లో బినామి పేరిట కొబ్బరి కాయలు,ఫొటోలు,పూజా సామాగ్రి అమ్మకం షాపు ను నడుపుతున్న నల్లెపు సాంబయ్య అనే గర్జనేతరుడు జాతర లో నాశి రకం సామాగ్రి ని అధిక ధరలకు అమ్మకాలు చేస్తూ ఇష్టా రాజ్య అక్రమ ధరలకు అమ్మకాలకు పాల్పడుతూ జాతరకు వచ్చే భక్తులను దోపిడీ చేస్తున్నాడని అదే విధంగా ఎలాంటి అనుమతి లేకుండా ఇదే ప్రాంగణం లో కిరాణం సైతం నడుపుతున్నాడని,అలాగే జాతరకు వచ్చే భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ జాతర యొక్క విశిష్టతను దెబ్బ తీస్తున్నాడని తక్షణమే ఇతని పై దేవదాయ అధికారులు చర్యలు తీసుకుంటూ ఇతని బినామీ దోపిడీని కట్టడి చేసి ఇతని పై క్రిమినల్ కేసు నమోదు చేసి జాతర ప్రాంగణం నుంచి సదరు వ్యక్తిని బయటకు పంపించి జాతర యొక్క ప్రతిష్టను కాపాడాలని లేని యెడల తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి,తుడుందెబ్బ మండల అధ్యక్షలు ఈక విజయ్ కుమార్ డిమాండ్ చేశారు కార్యక్రమం లో బూర్క పవన్,పులసం శివకృష్ణ,వట్టం కౌశిక్,బొల్లి సుశాంత్,బంగారి చరణ్ లు పాల్గొన్నారు.