విద్యా మందిర్ క్లాసెస్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి

డిఐఇఓ కి వినతిపత్రం

ఏబీఎస్ఏఫ్ జిల్లా అధ్యక్షుడు మంద ప్రమీల నరేష్, జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్

హన్మకొండ, నేటిధాత్రి:

నరేష్ మాట్లాడుతు నగరంలో విద్యా మందిర్ క్లాసెస్ యాజమాన్యానికి ఓకే బ్రాంచ్ కి మాత్రమే పర్మిషన్ ఉంటే నాలుగైదు బ్రాంచీలు ఏర్పాటుచేసుకొని అడ్మిషన్ ప్రక్రియ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు విద్యా సంవత్సరం ముగింపు కాకముందుకే ఉమ్మడి జిల్లాలోని పిఆర్వోలు ఏర్పాటు చేసుకొని ఎక్కడపడితే అక్కడ హోల్డింగ్ ఏర్పాటు చేసుకుంటూ అడ్మిషన్ ప్రక్రియ చేపడుతున్నారు ఇట్టి విషయం పై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం అని ప్రభుత్వ నియమాలు పాటించకుండా కనీసం సౌకర్యాలు లేకుండానే విద్యా మందిర్ క్లాసెస్ యాజమాన్యం విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ నీ అరికట్టాలనీ జిల్లా విద్యాశాఖ అధికారి నీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందనీ వారు అన్నారు తక్షణమే విద్యమందిర్ క్లాసెస్ యాజమాన్యం పైన చెర్యలు తీసుకోవాలనీ లేకపోతే జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సాయి బన్నీ విక్రం సురేష్ బాబు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *