“రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”
– ఎస్సై సంగమేశ్వర్
జహీరాబాద్. నేటి ధాత్రి:
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్సై సంగమేశ్వర్ తెలిపారు. జహీరాబాద్ నుండి రాయికోడ్ కు వయా ఝరాసంగం వెళ్లే ప్రధాన రోడ్డు పై మల్లన్న గట్టు కు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద సోమవారం సాయంకాల సమయంలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ వారికి చలాన్లు వేశారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని, అతి వేగంతో వాహనాల్ని నడపారాదని, రహదారులు పచ్చని చెట్ల నీడతో కప్పబడాలి తప్ప మనిషి రక్తంతో తడవకూడదని వాహనాలు ఢీకొనడం గాని రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల అంగ వికలాంగులు కావడం కుటుంబ సభ్యులకు దూరమావడం తన పై ఆధారపడ్డ వారికి దుఃఖం ను మిగిల్చకూడదని వారి జీవితం అగమ్య గోచరంగా మారుతుందని అందుకు
ప్రతి ఒక్కరు బరువుగా కాకుండా బాధ్యత గా హెల్మెట్ ధరించాలని సూచించారు. చిన్నపిల్లలకు బైకులు ఇవ్వరాదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన సూచించారు.