పరకాల నేటిధాత్రి
జనగామ జిల్లా,కొడకండ్ల మండల మండల కేంద్రానికి చెందిన కొలిపాక మన్విత్ పేదరికంలో ఉండి ఉన్నత విద్యను ఒక ప్రైవేట్ కళాశాలలో అభ్యసించడం జరుగుతుంది.కాలేజ్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న అట్టి విషయాన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా పరకాల ఏసీపీ ఏదుల కిషోర్ కుమార్ కి తెలపగానే వెంటనే స్పందించి సామాజీక స్పృహతో ఆ పేదింటి విద్యార్థికి అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్,చైర్మన్,పరకాల ఏసిపి కిషోర్ కుమార్ 15,000 అందించి కొండంత ధైర్యాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ సెక్రెటరీ చాతల్ల వేణుగోపాల్,తల్లి భవాని తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు అండగా ఏసీపీ కిషోర్ కుమార్
