పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి

జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో
ఎపుడు విధుల నిర్వహణలో ఎంతో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ ఉపాద్యాయుడిగా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధించి సమస్యలను నివృత్తి చేసి పరిక్షలంటే బయపడొద్దని, బాగా వ్రాయాలని విద్యార్థిలకు మనో ధైర్యాన్ని నింపారు. వివరాలలోకి వెళితే గురువారం గణపురం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ మౌలిక సౌకర్యాలను పాఠశాల ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. 10 వ తరగతి విద్యార్థినిలకు భౌతిక శాస్త్రం, గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులలో పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి వారి మేధోశక్తిని పరిశీలించారు. త్వరలో జరుగనున్న 10 వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. సబ్జెక్టులల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు పరిక్షలంటే బయ పడొద్దని వత్తిడిని జయించాలని చెప్పారు. పరీక్షల సమయంలో ఆరోగ్య పరిరక్షణ కూడా చాలా ముఖ్యమని తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. విద్య మాత్రమే మనిషిని ఉన్నతస్థాయికి చేర్చగలదని, అందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కస్తూర్భా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి చే జారిచేయనైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *