జైపూర్ , నేటి ధాత్రి:
తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి పురస్కరించుకొని మంచిర్యాల ఐబి నందు ఆయనకు ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వైద్య భాస్కర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన జీవితం సమాజానికి అంకితం చేసిన మహానీయుడని మన తెలంగాణ గాంధీగా పేరుందిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివని అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతిని నిర్వహించుకోవడం మన బాధ్యత అని తెలిపారు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915 సెప్టెంబర్ 27న ఆసిఫాబాద్ జిల్లా వాకిడిలో జన్మించి స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగారు . సహకార సంఘాలలో బాపూజీ ఎప్పటికప్పుడు సమిష్టి నిర్మాణం కోసం కృషి చేశారు. చేతివృత్తులు వ్యవసాయ ఆధారితవృత్తులు వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకు వృత్తి సంబంధ సబ్సిడీలకు కొండా లక్ష్మణ్ బాపూజీ మహోన్నతంగా కృషి చేశారు చేనేత పద్మశాలి ఉద్యమాలలో బీసీలను ఐక్యపరచడంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఏకకాలంలో కృషిచేసిన మహానీయుడు అని అదేవిధంగా జలదృశ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు కులాలవారు తన ఇల్లుని ఉద్యమక్షేత్రాలుగా మనసుకుని ఉద్యమాల వేదికగా చేసిన జలదృశ్యంలో తెలుగు దేశం ప్రభుత్వం జలదృశ్యంలోని తన ఇల్లును కూల్చివేసిన కృంగిపోకుండా కోర్టుకు వెళ్లి తన హక్కులను సాధించుకొని తనకంటూ ఏమి ఉంచుకోకుండా తన ఆస్తిలో మూడోవంతు ఆస్తులను ట్రస్ట్ కిందికి మార్చిన మహానీయుడని అదేవిధంగా తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 1969 లో తెలంగాణ రాష్ట్రం కోసం తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు ఏ పదవిని తీసుకొని మహా మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మంచర్ల సదానందం తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్టల మల్లేష్, ఉపాధ్యక్షుడు బియ్యాల సత్తయ్య ,పెద్దపల్లి సూరన్న పట్టణ కార్యదర్శి బద్ది శీను, వైద్య రవి, కుడక మోహన్ తదితరులు పాల్గొన్నారు